Watch Video Lessons

Choose what you'd like to learn from our video library.

eLearning Books

Choose what you'd like to learn from our Books library.

School Orders

Choose what you'd like to learn from our Books library.

News

ఈ నెల 28 నుంచి దసరా సెలవులు

తెలంగాణలోని ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఈ నెల 28 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అకడమిక్ క్యాలండర్ ప్రకారం ఈ నెల 28 నుంచి వచ్చేనెల 13 వరకు సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి పాఠశాలలు వచ్చేనెల 14న పునఃప్రారంభం కానున్నాయి. అలాగే ప్రాభుత్వ, ప్రయివేటు జూనియర్ కాలేజీలకు ఈ నెల 28 నుండి వచ్చేనెల 9 వరకు సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి కాలేజీలు వచ్చేనెల 10న పునఃప్రారంభం కానున్నాయి.

17-Sep-19

నేడు ఏపీపీజీఈసెట్‌-2019 చివరి దశ కౌన్సెలింగ్‌

ఇంజనీరింగ్‌, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గేట్‌, జీపీఏటీ, ఏపీపీజీఈసెట్‌-2019లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మంగళవారం చివరి దశ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు ఏపీపీజీఈ సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పీఎస్‌ అవధాని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్లలో మంగళవారం తమ సర్టిఫికెట్‌లు పరిశీలన చేయించుకోవాలని తెలిపారు.

17-Sep-19

అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాల గడువు పెంపు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి చివరి తేదీని ఈనెల 20 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఆయా కోర్సుల్లో చేరికకు విద్యార్హతలు, ఫీజు, తదితర వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచామని వెల్లడించాయి.

14-Sep-19

18న అగ్రి వర్సిటీ ప్రవేశాలకు చివరి కౌన్సెలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు చివరి కౌన్సెలింగ్‌ను ఈనెల 18న నిర్వహిస్తామని రిజిస్ట్రార్ ఎస్.సుధీర్ కుమార్ తెలిపారు. కోర్సుల వారీగా సీట్ల ఖాళీల వివరాలు, కౌన్సెలింగ్‌కు వచ్చే అభ్యర్థుల ర్యాంకుల సమాచారం కోసం www.pjtrau.edu.inను చూడాలని ఆయన తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు వెంటనే రూ. 36,450 ఫీజు చెల్లించాలని, లేదంటే ఆయా సీట్లు రద్దవుతాయని సూచించారు.

14-Sep-19

పారా మెడికల్ డిగ్రీ ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లోని పారా మెడికల్ డిగ్రీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాల దరఖాస్తులకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (బీఎస్సీ నర్సింగ్), రెండేళ్ల డిగ్రీ కోర్సు పోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (పీబీబీఎస్సీ నర్సింగ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ (బీఎస్సీ ఎంఎల్టీ) కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలుంటాయని వివరించారు. ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను పొందుపరుస్తామని, పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్ (www.knruhs.in, www.knruhs.telangana.gov.in) లో పొందవచ్చని తెలిపారు.

14-Sep-19

ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. సివిల్, ఆర్ముడ్ రిజర్వ్, ఏపీఎస్పీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు వార్డర్స్ విభాగాల్లో మొత్తం 2,723 పోస్టులకు గాను 2,623 పోస్టులను పోలీసు శాఖ భర్తీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను slprb.ap.gov.in వెబ్‌సైట్లో పోలీస్ శాఖ అందుబాటులో ఉంచింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా apslprb.pcsobj@gmail.comకు ఈ నెల 16వ తేదీలోపు పంపవచ్చని పోలీసుశాఖ పేర్కొంది.

12-Sep-19

నేడు ఏపీఆర్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ, ఎంఫిల్‌లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్- 2019 (ఏపీఆర్‌సెట్) నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేయనున్నట్లు ఆంధ్ర విశ్వవిద్యా లయం ఉపకులపతి ఆచార్య పీవీజీడీ. ప్రసాదరెడ్డి తెలిపారు. ఏయూ సెనేట్ మందిరంలో మంగళవారం ఆయన పరీక్ష వివరాలను వెల్లడించారు. ఈ నెల 16 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని, అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రూ.2 వేల అపరాధ రుసుముతో అక్టోబర్ 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.

11-Sep-19

బీడీఎస్‌ తుది కౌన్సెలింగ్‌ నేడు

బీడీఎస్‌ ప్రవేశాలకు తుది విడత కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. నీట్‌లో 107 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన జనరల్‌, 86 మార్కులుపైన వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, 96 మార్కులుపైన వచ్చిన దివ్యాంగ అభ్యర్థులు బుధవారం మధ్యాహ్నం 3 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు నీట్‌ ర్యాంక్‌ కార్డు, ఇంటర్‌ మార్కులు, స్టడీ, కమ్యూనిటీ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో సమర్పించాలని, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తర్వాత 12న మధ్యాహ్నం 2 వరకు వెబ్‌ ఆప్షన్లు తీసుకుంటామని, అనంతరం అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు. బీడీఎస్‌ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు 13న ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

11-Sep-19

అక్టోబర్ 21 నుంచి డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు

బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) విద్యార్థులకు అక్టోబర్ 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్‌కు ఈనెల 25 ఆఖరి తేదీ. డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 26 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 29 నుంచి నవంబర్ 3 వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ 5 నుంచి 8 వరకు జరగనున్నాయి. పరీక్షల సమయం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థులు వర్సిటీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని, పూర్తి వివరాలకు సంబంధిత అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని వర్సిటీ అధికారులు తెలిపారు.

08-Sep-19

పీఈటీ రివైజ్డ్ ఫైనల్ కీ విడుదల

తెలంగాణలో ఉపాధ్యాయుల నియామకంలో భాగంగా నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(తెలుగు మీడియం) పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షల రివైజ్డ్ ఫైనల్ కీని కమీషన్ వెబ్‌సైట్‍‌లో పొందుపరిచినట్లు TSPSC తెలిపింది. వివరాలను www.tspsc.gov.in వెబ్‌సైట్‍‌లో పొందవచ్చు.

07-Sep-19
View All
Videos
View All
Books
View All
School Orders
Upload image
Best School
No schools found