Best School

జనరల్ సైన్స్

జనరల్ సైన్స్

Location: జనరల్ సైన్స్ బిట్స్

released: 2020-02-03 19:51:21

Description

>అరటిపండులో మన శరీరానికి పనికొచ్చే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. >బీట్ రూట్ లో పిండిపదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. >బటానీలో మాంసకృత్తులు సంవృద్ధిగా ఉంటాయి. అయితే కొందరిలో ఇవి అలర్జీ కలిగిస్తాయి. కొందరికీ జీర్ణం కావు. >ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంటులు మనలను రోగాలబారీ నుండి కాపాడే పదార్థాలు. >చిలగడదుంపలలో రక్తాన్ని శుద్ధిచేసే పదార్థాలు (కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంటులు) ఉంటాయి. >టమాటాలో విటమిన్ 'సి' పదార్థం ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. >'సాలడ్' అనే పదం 'సాలాటా' అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సాలటా అంటే ఉప్పు అని అర్థం. >ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారుచేస్తారు. >ఒక ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుదయస్కాంతాన్ని తయారుచేస్తారు. >భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయాస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలే ఉంటుంది. >భూ అయస్కాంత తీవ్రత శీతల (ఫ్రిజ్) అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. >వాన చినుకు గంటకు 7 నుండి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. >వానచినుకు 0.02 అంగుళాల నుండి 0.31 అంగుళాల వ్యాసార్ధం కలిగి ఉంటుంది. >నీటిని, నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను 'భాష్పీ భవనం' అంటారు. >నీటి ఆవిరిని నీరుగా మార్చే ప్రక్రియను 'సాంద్రీ కరణం' అంటారు. >నీటిని మంచుగా మార్చే ప్రక్రియను 'ఘనీ భవనం' అంటారు. >పరిశ్రమలు, వాహనాల నుండి వెలువడే సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్ లతో మేఘాలు కలుశితమైనపుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. >పెంగ్విన్, ఆస్ట్రిజ్, ఈమూ, రేహా మొదలైన పక్షులకు రెక్కలు ఉంటాయి. కానీ ఎగరవు. >600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. >జంతువులను ఆరు ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి - అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. > ప్రస్తుతం భూమిమీద జీవించి ఉన్న జంతుజాలంలో 5,400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. > ఎక్కువకాలం ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండే జంతువులు స్పంజికలు. ఎందుకంటే వీటికి చలనం ఉండదు. > జంతువులలో పెద్ద జంతువు నీలి తిమింగలం. > నీలి తిమింగలం 110 నుండి 160 టన్నుల బరువు, 20 నుండి 30 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. > 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుండి పక్షులు ఉద్భవించాయి. > ఎడారి జంతువులు ఎక్కువగా నిశాచరులు, పగలు వేడినుండి తప్పించుకోడానికి బొరియలలో నివసిస్తాయి. > చిరతపులి పిల్లి కుటుంబానికి చెందినది. ఇది 12 నుండి 17 సంవత్సరాలపాటు జీవిస్తుంది. > ఒక వస్తువు రంగు దానినుండి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. కావున మనం ఆ వస్తువు యొక్క రంగును చూడగలుగుతున్నాం. > ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రతపై కుడా ఆధారపడి ఉంటుంది. > నీటి సాంద్రత 1 గ్రా/మి.లీ. ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రా/మి.లీ. కన్నా తక్కువ ఉండాలి. > మంచుగడ్డ స్పటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటికన్నా తక్కువగా ఉండడం వల్ల నీటిపై తేలుతుంది. > క్యాండిల్ అనేపదం క్యాండేర్ అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది. క్యాండేర్ అంటే మెరుపు అని అర్థం. > బివ్యాక్స్ తో తయారుచేసిన కొవ్వొత్తులు తీయని వాసన కలిగి ఉంటాయి. తక్కువ పొగనిస్తాయి. > పిల్లి రోజులో దాదాపు 14 గంటలు నిద్రపోతుంది. > షార్క్ చేప నోటిలో దాదాపు 4.000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 3 మి.మి. పొడవు ఉంటుంది. > ఆల్ఫైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు. > నేలపైన ఉండే అన్ని రకాలైన ఆవాసాలను కలిపి 'భౌమ ఆవాసాలు' అంటారు. > పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి భౌమావాస జంతుజాలం ఉంటుంది. > సముద్రగర్భంలో మైళ్ళకొద్దీ వ్యాపించి ఉండే 'కోరల్ రీఫ్' కుడా ఒక అవాసమే. > ఎడారి ఆవాసాలలో నివసించే ఎలుకలు నీళ్ళు తాగకుండా ఒంటెలకన్నా ఎక్కువకాలం ఉండగలుగుతాయి. > సవానా గడ్డిభూముల ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. > భూమిమీద విస్తరించి ఉన్న సముద్రాలలో 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది. > కర్పూర వృక్షం (సిన్నమోసం కంఫోరా) చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారుచేస్తారు. > ఉప్పు, పటిక మొదలైన స్పటికాలలో కుడా నిరుంటుంది. దీనిని స్పటిక జలం అంటారు. > జోర్డాన్ దేశంలో ఉన్న మృతసముద్రంలో నీటిమీద మనం సులభంగా నడవవచ్చు. > రాజస్థాన్ లోని 'సాంబార్ సరస్సు' మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. > ఏదైనా పదార్థం నేరుగా ఘణరూపం నుండి వాయురూపంలోకి లేదా వాయురూపం నుండి ఘణరూపంలోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు. > రంగులను వేరుచేసే పద్ధతిని 'క్రోమేటోగ్రఫీ' అంటారు. > మనం ఎక్కువకాలం స్వేదనజలాన్ని తాగినట్లయితే జీవక్రియలు మందగిస్తాయి. కారణం లవణాలు లోపిస్తాయి. > ఘనస్థితిలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ను 'డ్రై ఐస్' అంటారు. > మొక్కలు, జంతువుల నుండి తయారయ్యే దారాలను 'సహజమైన దారాలు' అంటారు. > రసాయనాలతో తయారుచేసిన దారాలను 'కృత్రిమ దారాలు' అంటారు. పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, అక్రిలిక్ మొదలైనవన్నీ కృత్రిమ దారాలు. > బైండింగ్ లో ఉపయోగించే గుడ్డను కాలికో అంటారు. > పట్టుపురుగులనుండి పట్టు తీసినట్లుగానే సాలెపురుగు నుండి కూడా పట్టును తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. > బట్టల నేతలో ఉపయోగించే దారాలు రెండు వరసలలో ఉంటాయి. ఒకటి నిలువు వరస రెండోది అడ్డువరస. నిలువు వరుసను 'పడుగు' అనీ, అడ్డు వరుసను 'పేక' అంటారు. > పత్తికాయలనుండి పత్తిని వేరుచేయడాన్ని జన్నింగ్ అంటారు. > ఇలా వేరు చేసిన పత్తిని దూది అంటారు. > దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తాయారుచేయడాన్ని వడకడం (స్పిన్నింగ్) అంటారు. > జనపనారను బంగారు దారం అంటారు. > వాల్టో. యల్. సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలి వినైల్ క్లోరైడ్ ను కనుగొన్నాడు. డా. మియోషి వోకమోటో ఆను శాస్త్రవేత్త 1970లో మొట్టమొదటి సూక్ష్మదారం (మైకో ఫైబర్)ను కనుగొన్నాడు ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుండి తయారుచేస్తారు కర్ర గుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు ఒక పత్తికాయ నుండి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు కొన్ని మొక్కలు భూమి ఉపరితలంనుండి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వేళ్ళు విస్తరిస్తాయి బనానా ఆయిల్ ను పెట్రోలియం నుండి తయారు చేస్తారు కొన్ని మొక్కల వేర్లలో ప్రధానమైన వేరు లావుగా, మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది. ఈ ప్రధానమైన వేరును ‘తల్లివేరు’ అంటారు. సన్నని వేర్లను ‘పార్శ్వ వేర్లు’ అంటారు వేర్లలో దాచిపెట్టుకునేవి ఉదా. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ కాండంలో దాచిపెట్టుకునేవి ఉదా. బంగాళాదుంప, వెల్లుల్లి, అల్లం మొక్కల కాండం మీద ఉండే చిన్న ఉబ్బెత్తు భాగాలనుండి కొమ్మలు,ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రము, పరాగకోశాలను లైంగిక భాగాలు అంటారు పత్రంలో కనిపించే రేఖలను ‘ఈనెలు’ అంటారు. పత్రదళంలో మధ్యలో కనిపించే పొడవైన ఈనెను ‘నడిమి ఈనె’ అంటారు దీని నుండి ఏర్పడే శాఖలను ప్రక్కఈనెలు అంటారు. ఈ ఈనెల అమరికను ‘ఈనెల వ్యాపనం’ అంటారు పత్రంలో చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగం రక్షకకణాలు. వాటి మధ్య ఉన్న రంధ్రాల్ని ‘పత్రరంధ్రాలు’ అంటారు పుష్పాలు రంగులను కలిగి ఉండి పరాగసంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు జాలాకార ఈనెల వ్యాపనం కలిగి ఉంటుంది పీచువేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు సమాంతర ఈనెల వ్యాపనం కలిగి ఉంటుంది ద్రాక్ష వంటి ఎగబాగే మొక్కలలో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడిపోకుండా పాకడానికి వీలుగా తీగలు, కొక్కేలు ఏర్పడతాయి ఆపిల్ బరువులో 84% , దోస బరువులో 96% నీరు ఉంటుంది కొన్ని మొక్కలు ఆహారాన్ని వేర్లు, కాండంలలో దాచిపెట్టుకుంటాయి జోడి మామిడిలో పండుగా కనిపించేది పండు కాదు. అది పండు తొడిమ మిరపకాయలో కారం కలిగించే పదార్థాన్ని కాప్సేషియం అంటారు మర్రి వంటి చెట్లను కుండీలో ఇమిడిపోయేలా పెంచడానికి ఒక పధ్దతి ఉంది. దీనిని బోన్సాయ్ అంటారు. వీటిని వామన వృక్షాలు అనికూడా అంటారు. బోన్సాయ్ జపాన్ దేశపు సాంప్రదాయ కళ ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలి పీడనం తగ్గుతుంది భూమి తన అక్షం చుట్టూ తానూ తిరగడం వల్ల వాతావరణంలో మార్పులు(ఋతువులు) ఏర్పడతాయి వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటున్నాం మనం తిన్న ఆహరం జీర్ణక్రియలో అనేక యాంత్రిక, రసాయన చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాలనుండి పెరుగు తయారుచేయడాన్ని ‘కోయాగ్యులేషన్’ అంటారు ప్రీ హిస్టారిక్ యుగంలోని మొక్కలు, జంతువుల అవశేషాలనుండి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పుకు ఒక ఉదాహరణ పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారినపుడు సాధారణంగా భౌతికమార్పు జరుగుతుంది. ఇంధనాలలో నిలువ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. జనరల్ సైన్స్ బిట్స్ 4 >ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల నీటితోనే సర్దిపెట్టుకుంటున్నారు. >రెండడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలను సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. అందుకే వరద నీటిలో వాహనాలు నడపకూడదు. >నీటిని మిల్లీ లీటర్లు, లీటర్లలో కొలుస్తారు. నీరు నిల్వ ఉండే రిజర్వాయర్ల మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. ప్రాజెక్టులనుండి విడుదల చేసే నీటిని క్యూసెక్ లలో కొలుస్తారు. >వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ (Radio Detection Ranging) అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు వాటి గురించి తెలుసుకుంటారు. >ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,000 మందికి పైగా నీటివల్ల సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తారు. >నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వ్యాధులు ఉంటాయి. >అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించే మరణాలలో 98% కలుషిత నీటివల్లనే జరుగుతాయి. >ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం 50 లీటర్ల నీరు కావాలి. >థేల్స్ ఆఫ్ మిలిస్ అను గ్రీకు శాస్త్రవేత్త (క్రీ. పూ. 624-546) స్థిరవిద్యుత్తును కనుగొన్నాడు. >బల్బును కనుగొన్న శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ కనుగొన్నాడు. >బల్బులోపల ఉండే రెండు తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగులాంటి తీగ ఉంటుంది. ఇదే బల్బులో వెలిగే భాగం. దీన్నే ఫిలమెంట్ అంటారు. >విలియం బర్డ్స్ అనే బ్రిటిషు శాత్రవేత్త (1544-1603) విద్యుత్తును కనుగొన్నాడు. ఇది ఒక ప్రవాహం లాంటిదని దానికి హ్యూమర్ అనే పేరు పెట్టాడు. >బెంజిమన్ ఫ్రాంక్లిన్ అను అమెరికన్ శాస్త్రవేత్త (1706-1790) విద్యుత్ కు ధన, ఋణ ఆవేశాలుంటాయని కనుగొన్నాడు. >లూగి గాల్వాని అను ఇటలీ శాస్త్రవేత్త (1737-1798) చనిపోయిన కప్పు కాళ్లకు రెండు లోహపు పలకలను తగిలించినపుడు అది ఎగిరిపడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. >హన్స్ ఆయిర్ స్టడ్ అను డేనిష్ శాస్త్రవేత్త (1777-1851) విద్యుత్, అయస్కాంతంగా పనిచేస్తోందని కనుగొన్నాడు. >మైఖేల్ ఫారడే అను భౌతిక శాస్త్రవేత్త (1791-1867) మొట్ట మొదటగా విద్యుత్ మోటారును, విద్యుత్ జనరేటర్ ను కనుగొన్నాడు. >విద్యుత్ ను తమ గుండా ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. >విద్యుత్ ను తమ గుండా ప్రవహింపనీయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. >ఇంగ్లాండ్ లోని గోడల్మింగ్ అనే ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసారు. >థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. >పొడవును ప్రమాణం మీటరు, మిల్లీ మీటరు, సెంటీ మీటర్లను చిన్న ప్రమాణాలుగా గుర్తిస్తారు. >ప్రపంచంలో అతిపొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ . దీని పొడవు 164.8 కి. మీ. >ఒక అడుగు పన్నెండు అంగుళాలకు సమానం. >మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రామ్. ఇది ఇక ఘణపు సెంటీమీటరు నీటికి సమానం. >కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి, కాలానికి చెందిన ప్రమాణాలకు గురించిన వివరణలున్నాయి. >మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ, బిగాలలో కొలిచేవారు. >ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం, ఇరీడియం లోహాలను కలిపి చేసిన ఒక ప్రత్యేక లోహంతో చేసిన కడ్డీ పొడవును ప్రామాణికంగా తీసుకోవాలని అన్ని దేశాలవారు నిర్ణయించారు. ఈ కడ్డీ పొడవునే ఒక మీటరు అని పిలుస్తాం. >1957 ఏప్రిల్ 1న మనదేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. >విమానాలు, ఓడల వేగాన్ని నాట్/నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. ఒక నాట్ 1.852 కి.మీ./గంటలకు సమానం. >ఒక మైలు 1.61 కి.మీ.లకు సమానం. >ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని ‘పారలాక్స్’ యూనిట్లలో కొలుస్తారు. >ఒక మీటరులో 100,00,00,000 వంతును నానో మీటరు అంటారు. >కంప్యూటర్లు, సెల్ ఫోన్ల వంటి మెమొరీని బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెర్రాబైట్స్ లలో కొలుస్తారు. >ఒక కిలోగ్రామ్ బియ్యం ఉత్పత్తి చేయడానికి 5,000 లీటర్ల నీరు ఖర్చవుతుంది. >బంగారం, వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. ఈ సమాచారం 6 వ తరగతి సామాన్య శాస్త్రం పుస్తకం నుండి సేకరించబడింది.