Watch Video Lessons

Choose what you'd like to learn from our video library.

eLearning Books

Choose what you'd like to learn from our Books library.

School Orders

Choose what you'd like to learn from our Books library.

News

గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తులు

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయడమైనది. రూ.100 రుసుముతో ఈనెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 10 వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. ఏప్రిల్ 7న ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది. ఒక్కో గురుకుల పాఠశాలలో ఐదో తరగతి కింద 80మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లో కలిపి 49,280 సీట్లు భర్తీ చేయనున్నారు. గురుకుల పాఠశాలలో ప్రవేశానికి సమీపంలోని మీ-సేవా కేంద్రాలు లేదా ఇంటర్నెట్‌లో దరఖాస్తు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు 1800 425 45678 నంబర్‌లలో లేదా www.tstwgurukulam.telangana.gov.in , www.tswreis.in వెబ్‌సైట్‌లను చూడవచ్చు.

18-Feb-19

602 పోస్టులతో స్పెషల్ డీఎస్సీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్జ్రంలోని జిల్లా పరిషత్, ప్రభుత్వ మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లోని దివ్యాంగ విద్యార్థులకు సమ్మిళిత విద్యను బోధించుటకు 602 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేపట్టేందుకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్ర వారం ప్రత్యేక డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేశారు. ఎంపికైన ఉపాధ్యాయులు దివ్యాంగ విద్యార్థులకు సమ్మిళిత విద్యాబోధన చేస్తారు. షెడ్యూల్ వివరాలు ఈ నెల 16న టెట్ కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల ఈ నెల 25 నుంచి మార్చి 11 వరకూ పరీక్ష ఫీజు చెల్లింపు ఈ నెల 25 నుంచి మార్చి 12 వరకూ ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 25 నుంచి 31 వరకు సెంటర్ల నమోదు మే 7 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడింగ్ మే 15 రాత పరీక్ష (సీబీటీ) మే 16న ప్రాథమిక 'కీ' విడుదల మే 23న ఫైనల్ 'కీ' విడుదల మే 25న మెరిట్ లిస్టు విడుదల

16-Feb-19

25 నుండి దేహాదారుఢ్య పరీక్షలు

భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లోని x గ్రూపులో, y గ్రూపు కేటగిరిలలో ఉద్యోగాల నియామకం కొరకు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో నిర్వహించే దేహాదారుఢ్య పరీక్షలలు నిర్వహించనున్నారు. నిరుద్యోగ అభ్యర్థులు హజరుకావాలని జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి బల రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు www.dirmenselection.cdac.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు.

16-Feb-19

సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తుల స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ క్వాంటిటేటివ్ మెథడ్స్ (సీక్యూఎం) లో డాటా అనాలసిస్ అండ్ మెషిన్ లర్నింగ్ యూజింగ్ ఆర్/పైథాన్‌పై సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సు మొదటి బ్యాచ్ గతేడాది జూన్‌లో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ కోర్సు తరగతులను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు, 22వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు www.osmania.ac.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు.

16-Feb-19

18న జాబ్‌మేళా

నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశం కొరకు జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో అర్బన్‌ కమ్యూనిటీ డెవల్‌పమెంట్‌(యూసీడీ) ఆధ్వర్యంలో ఈనెల 18న సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో జాబ్‌మేళాను నిర్వహిస్తున్నామని సికింద్రాబాద్‌ సర్కిల్‌ ఉపకమిషనర్‌ రవికుమార్‌ తెలిపారు. 18వ తేదీ సోమవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఈ జాబ్‌మేళా జరుగుతుంది. పదో తరగతి పాస్‌, ఫెయిల్‌, ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్‌, ఎంసీఏ. డిప్లొమా అర్హత కలిగిన 18 నుంచి 35 సంవత్సరాల వారు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చు. ఈ జాబ్‌మేళాలో ఇరవై పైగా సంస్థలు, వారి హెచ్‌ఆర్‌లు పాల్గొంటారని తెలిపారు. అసక్తి కలిగిన యువతీ, యువకులు ధ్రువీకరణ పత్రాలు ఒరిజినల్‌, జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలని ఆయన తెలిపారు.

16-Feb-19

ఏపీ డీఎస్సీ-2018 ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ-2018 రాతపరీక్ష ఫలితాలను రాజమహేంద్రవరంలో మధ్యాహ్నం 1.30 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. జిల్లాల వారీగా సబ్జెక్టుల వారీగా మెరిట్‌ జాబితాను ప్రకటించారు. ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ నుంచి విశాఖపట్నానికి చెందిన పుణ్యవతి సాహు, ఫిజిక్స్‌ నుంచి తూర్పుగోదావరికి చెందిన కనకరాజు అనిశెట్టి, బయాలజీ నుంచి ప్రకాశం జిల్లాకుచెందిన పాణ్యం వెంకట సుధీర్ కుమార్, సోషల్‌ నుంచి పశ్చిమగోదావరికి చెందిన నీలం మణికంఠ మొదటి స్థానంలో నిలిచారు. అదే విధంగా స్కూలు అసిస్టెంట్ ఇంగ్లిష్‌లో గుంటూరుకు చెందిన మల్లవలపు ప్రభాకర్ బాబు మొదటి స్థానంలో నిలిచినట్లు మంత్రి తెలిపారు. https://apdscreports183296.apcfss.in/downloadMeritListPdf2478596314.dsc ఈ లింక్ ద్వారా ఫలితాలను పొందవచ్చు.

15-Feb-19

నేటినుండి పదవ తరగతి ప్రీఫైనల్, 17న ఏఈఈ స్క్రీనింగ్ టెస్ట్

తెలంగాణలో పదవ తరగతి ప్రీఫైనల్ పరీక్షలను నేటినుండి ఈ నెల 27 వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు విద్యాశాఖ పూర్తి చేసింది. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:15 గంటల వరకు నిర్వహించనున్నారు. 17న ఏఈఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏపీలో వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) 309 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ ఈ నెల 17న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనుంది. అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హాల్ టికెట్లు అందివ్వడం జరిగింది.

15-Feb-19

ఎస్టీ గురుకులాల్లో 1100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీలో గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న 1100 పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షీయల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ లెక్చరర్లు 44 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ షెడ్యూల్డ్ ఏరియాలో 32, నాన్ షెడ్యూల్డు ఏరియాలో 24, ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లు షెడ్యూల్డ్ ఏరియాలో 234, నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో 642 పోస్టులు, షెడ్యూల్డ్ ఏరియాలో పీఈటీ 25, నాన్ షెడ్యూలు ఏరియాలో 99 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు. . ఆర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చు.

15-Feb-19

నేడు ఏపీ డీఎస్సీ ఫలితాలు

ఏపీ డీఎస్సీ-2018 పరీక్షల ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలో నేడు మధ్నాహ్నం 12గంటలకు విడుదల చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా అభ్యర్థుల జనరల్ మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. మొత్తం 47 సబ్జెక్టుల్లో 7,902 టీచర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. జనరల్ మెరిట్ లిస్టులను విడుదల చేసిన తర్వాత రోస్టర్ కమ్ రిజర్వేషన్ ప్రకారం సెలెక్షన్ జాబితా తయారీ నెల చివరి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది.

15-Feb-19

యూజీసీ నెట్‌ - 2019 నోటిఫికేషన్‌‌ విడుదల

జాతీయ స్థాయిలో ఆయా విశ్వవిద్యాలయాల్లో లెక్చరర్‌షిప్‌ (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌), జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ కోసం యూజీసీ నెట్‌ - 2019 నోటిఫికేషన్‌‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఏ) విడుదల చేసింది. మార్చి 1 నుంచి 30 వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. మే నెల 15 నుంచి అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్‌ ప్రక్రియ ఉంటుంది. జూన్‌ 20 నుంచి 28 వరకు నెట్‌ పరీక్షలు జరగనున్నాయి. జూలై 9న ఫలితాలు విడుదలచేస్తారు. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే యూజీసీ నెట్‌ పరీక్షల్లో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. పేపర్‌ - 1 : టీచింగ్‌, రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 100మార్కులకు గాను 50 ప్రశ్నలు అడుగుతారు. పేపర్‌- 2లో 200 ప్రశ్నలకు గాను 100 ప్రశ్నలు ఉంటాయి. మొదటి పేపర్‌కు గంట, రెండో పేపర్‌కు రెండు గంటలు, మొత్తం రెండు పేపర్‌లకు మూడు గంటల సమయం ఉంటుంది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసిన వారు, పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తులు పంపవచ్చు. పూర్తి వివరాలు యూజీసీ వైబ్‌సైట్‌‌లో పొందవచ్చు.

14-Feb-19
View All
Videos
View All
Books
View All
School Orders
Upload image
Best School
No schools found